ఈ వీకెండ్ సినిమాలివే!

This weekend friday releases
Thursday, July 20, 2017 - 16:15

ఈ వీకెండ్ 5 స్ట్రయిట్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీ మాత్రం ఒక్కటే. అదే ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. విడుదలైన 2 ట్రయిలర్స్ హిట్ అవ్వడంతో పాటు హీరోయిన్ సాయి పల్లవికి క్రేజ్ పెరగడంతో సినిమాపై అందరి చూపు పడింది.

రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో వైశాఖం కూడా ఉంది. పీఆర్వో బీఏ రాజు భార్య బి.జయ ఈ సినిమాకు దర్శకురాలు. హరీష్, అవంతిక హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నాగార్జున, మహేష్, నాని లాంటి స్టార్లు ఈ సినిమాకు ప్రచారం కల్పించారు. 

ఈ రెండు సినిమాలతో పాటు దండుపాళ్యం-2, టీమ్-5, మాయామాల్ అనే మరో 3 సినిమాలు కూడా వస్తున్నాయి. కన్నడంలో సూపర్ హిట్ అయిన దండుపాళ్యంకు రీమేక్ గా పార్ట్-2 వస్తోంది. క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా టీమ్-5 వస్తోంది. ఇక హారర్ కాన్సెప్ట్ తో ముస్తాబైంది మాయామాల్. వీటిలో ఈ వీకెండ్ ఏది  క్లిక్ అవుతుందో చూడాలి.