ఈ వీకెండ్ ఓటీటీ రిలీజెస్

This Weekend OTT attractions
Friday, May 15, 2020 - 15:45

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలోకి చాలా స్టఫ్ వచ్చి చేరింది. వీకెండ్ కూడా కావడంతో దాదాపు అన్ని ఓటీటీలు ఈరోజే తమ ఒరిజినల్ కంటెంట్ ను, సినిమాల్ని రిలీజ్ చేశాయి.

నెట్ ఫ్లిక్స్ లో మలంగ్ మూవీని ఇవాళ్టి నుంచి పెట్టారు. లాస్ట్ ఇయర్ హిట్టయిన హాలీవుడ్ మూవీ అన్-టచబుల్ కూడా ఈరోజే స్ట్రీమింగ్ కు వచ్చింది. దీంతో పాటు SWAT, MAUDIE అనే మరో 2 సినిమాల్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటికంటే ఒరిజినల్ కంటెంట్ ను ఎక్కువగా పెట్టింది. నెటిజన్స్ ఎదురుచూస్తున్న మేజిక్ ఫర్ హ్యూమన్స్ సీజన్-3, మేడమ్ సెక్రటరీ సీజన్-6 ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అనే ఫ్రెంచ్ సిరీస్, స్ట్రేంజర్స్ ఫ్రం హెల్ అనే కొరియన్ సిరిస్ ను కూడా తీసుకొచ్చింది.

అటు హాట్ స్టార్ లో ఈరోజు ఒకేసారి 6 ఒరిజినల్స్ అందుబాటులోకి వచ్చాయి. బీ అవర్ చెఫ్, ఫ్యూరీ ఫైల్స్ లాంటివి ఇందులో ఉన్నాయి. అటు ZEE5లో ఇవాళ్టి నుంచి ప్రియదర్శి, శశాంక్ నటించిన లూజర్ అనే ఒరిజినల్ అందుబాటులోకి వచ్చింది. ఆహా యాప్ లో ఇవాళ్టి నుంచి శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాను ఉంచారు.

అటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈరోజు ది లాస్ట్ నార్క్ ఫస్ట్ సీజన్ మొదలైంది. దీంతో పాటు పాతాళ్ లోక్ అనే మరో సీజన్ కూడా షురూ అయింది. రాబోయే రోజుల్లో వివిధ భాషలకు చెందిన 7 సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది అమెజాన్. ఇందులో జ్యోతిక, కీర్తిసురేష్ సినిమాలున్నాయి.