రాగల వీకెండ్ లో ఓటీటీ చిత్రాలు

This Weekend OTT attractions - May 23
Saturday, May 23, 2020 - 16:30

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలోకి చాలా స్టఫ్ వచ్చి చేరింది. వీకెండ్ కూడా కావడంతో దాదాపు అన్ని ఓటీటీలు తమ ఒరిజినల్ కంటెంట్ ను, సినిమాల్ని రిలీజ్ చేశాయి.

ది లవ్ బర్డ్స్.. గత వారమే యూఎస్ లో రిలీజైన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు పెట్టింది.  దీంతో పాటు లివింగ్ ఇన్ బాండేజ్ బ్రేకింగ్  ఫ్రీ అనే సినిమాను కూడా కొత్తగా యాడ్ చేసింది. అటు సిరీస్ ల విషయానికొస్తే.. ది-100 సీజన్-7తో పాటు, స్పానిష్ సిరీస్ కంట్రోల్-జెడ్ సీజన్-1ను పరిచయం చేసింది.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో సూపర్ హిట్టయిన హోమ్ కమింగ్ సీజన్-2 అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ది లాడ్జ్ అనే ఇంగ్లిష్ మూవీతో పాటు 2 కన్నడ సినిమాల్ని, ఓ మలయాళం మూవీని స్ట్రీమింగ్ కు పెట్టింది. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ యూఎస్ వ్యూయర్స్ కోసం "రాగల 24 గంటల్లో" అనే థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు "వజ్రకవచథర", "నాట"కం అనే మరో 2 పాత సినిమాల్ని కూడా ఫ్రెష్ గా తీసుకొచ్చింది.

ఇక జీ5లో హిందీ మూవీ ఘూమ్ కేతు అందుబాటులోకి రాగా.. సన్ నెక్ట్స్ లో అధ్యక్షన్ అమెరికా అనే కన్నడ సినిమా పెట్టారు. ఇక డిస్నీ హాట్ స్టార్ లో ది బిగ్ ఎఫ్ఐబీ సీజన్-1 అందుబాటులోకి వచ్చింది.