నిఖిల్ కి రేపు పరీక్షా సమయం

This weekend releases: Arjun Suravaram, Raja Vaaru Rani Gaaru
Thursday, November 28, 2019 - 13:15

2017.. కేశవ.. యావరేజ్
2018.. కిరాక్ పార్టీ.. ఫ్లాప్
2019.. అర్జున్ సురవరం.. రిజల్ట్ ఏంటి?

నిఖిల్ కు ఇది టెస్టింగ్ టైమ్. సరైన హిట్ లేక సతమతమౌతున్న ఈ హీరో ఇప్పుడు తన ఆశలన్నీ అర్జున్ సురవరం సినిమాపైనే పెట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమా కిరాక్ పార్టీ వచ్చిన వెంటనే, గతేడాదిలోనే రావాల్సింది. ఎన్నో కారణాల వల్ల వాయిదాపడుతూ ఈ ఏడాదికి షిఫ్ట్ అయింది.

రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా క్లిక్ అయితే.. నిఖిల్ కెరీర్ మళ్లీ గాడిన పడుతుంది. లేదంటే.. 2019 అనేది అతడి కెరీర్ కు ఓ నెగెటివ్ మార్క్ గా మిగిలిపోతుంది. ఈ సినిమాలో చదువులు, నకిలీ సర్టిఫికేట్లు, ఎగ్జామ్స్ లాంటి ఎలిమెంట్స్ టచ్ చేశాడు నిఖిల్. సరిగ్గా అతడి కెరీర్ కూడా ఇలాంటి టెస్టింగ్ టైమ్ లోనే నిలిచింది. అర్జున్ సురవరం హిట్ అవ్వడం నిఖిల్ కు ఇప్పుడు అత్యవసరం.

ప్రస్తుతానికి బాక్సాఫీస్ సైడ్ నుంచి నిఖిల్ కు ఎలాంటి పోటీ లేదు. రాగల 24 గంటల్లో, జార్జ్ రెడ్డి సినిమాలు పెద్దగా నడవడం లేదు. తోలుబొమ్మలాట ఫ్లాప్. యాక్షన్, తెనాలి, తిప్పరామీసం లాంటి సినిమాలు ఎప్పుడో దుకాణం సర్దేశాయి.

ఇటు అర్జున్ సురవరంతో పాటు వస్తున్న రాజావారు-రాణిగారు పెద్దగా పోటీ ఇచ్చే సినిమా కాదు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు వస్తుందో రాదో తెలీదు. డబ్బింగ్ సినిమా తూటా కూడా పోస్ట్ పోన్ అయింది. సో.. వాతావరణమైతే నిఖిల్ కు అనుకూలంగానే ఉంది. సినిమాలో కంటెంట్ ఎలా ఉందనేదే బ్యాలెన్స్.