బికినీ అంటే? కృష్ణ‌వంశీ ప‌్ర‌శ్న

What is bikini, asks director Krishna Vamsi
Tuesday, July 25, 2017 - 18:15

కృష్ణ‌వంశీని అంతా క్రియేటివ్ డైర‌క్ట‌ర్ అంటారు. గులాబీ, అంతఃపురం, సింధూరం.. ఇలా వాస్త‌విక క‌ళాత్మ‌క‌ సినిమాల‌తో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన సృజ‌నశీలి ఆయ‌న‌. 

ఈ మ‌ధ్య బాక్సాఫీస్ వ‌ద్ద ఆయ‌న సినిమాలు సంచ‌ల‌నం సృష్టించ‌డం లేదు కానీ ఇప్ప‌టికీ హీరోయిన్ల‌ను అందంగా ప్రెజెంట్ చేసే అతికొద్దిమంది ద‌ర్శ‌కుల్లో ఆయ‌న ఒక‌రన్న విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఆనాటి మ‌హేశ్వ‌రి, సొనాలి బెంద్రే నుంచి కాజ‌ల్, తాప్సీ వ‌ర‌కు ఆయ‌న సినిమాల్లో సోయ‌గాల షోతో ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు క‌లిగించిన‌వారే. అలాంటి ద‌ర్శ‌కుడికి బికినీ అంటే ఏంటో తెలియ‌ద‌ట‌. అవును ఆయ‌నే చెప్పారు మ‌రి. ఈ కొంటె ఆన్స‌ర్ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఇచ్చారు.

త్వ‌ర‌లోనే ఆయ‌న న‌క్ష‌త్రం సినిమా విడుద‌ల కానుంది. ఇందులో రెజీన‌, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తూ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చారు. 

న‌క్ష‌త్రంలో బికినీ సీన్ ఉంటుందా సార్‌.. ఒక అభిమాని ప్రశ్న‌. 
బికినీ అంటే - కృష్ణ‌వంశీ రిప్ల‌యి. 

బికినీ అంటే ఆయ‌న‌కి తెలుస‌ని అది మ‌న‌కు తెలుస‌ని ఆయ‌న‌కు తెలుసు. ఐనా ఆయ‌న ఇలా స‌మాధానం ఇవ్వ‌డం స‌ర‌దాగానే ఉంది క‌దా. అన్న‌ట్లు న‌క్ష‌త్రంలో బికినీ షో ఉంద‌ట‌. ప్ర‌గ్యా జైస్వాల్ అభిమానుల‌ను ఈ విష‌యంలో ఫిదా చేస్తుంద‌ట‌.