ఇంతకీ దిల్‌రాజు ఏం చెప్తున్నాడ‌బ్బా!

What Dil Raju is trying to say about Srinivasa Kalyanam's box-office fate?
Tuesday, August 14, 2018 - 15:00

"శ్రీనివాస్ క‌ల్యాణం" సినిమా దిల్‌రాజుని పూర్తిగా క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేసింది. సినిమా ఫ్లాప్ అనే విష‌యం అర్థ‌మైంది కానీ ఎందుకు ఫ్లాప్ అయింద‌నేది ఆయ‌న‌కి అర్థం కావ‌ట్లేద‌ట‌. ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌లో దిల్‌రాజు ఫైన‌ల్ గా చెప్పిందిదే.

సినిమాకి మొద‌టి రోజు పాజిటివ్ టాక్ వ‌చ్చింద‌ట కానీ మ‌ధ్యాహ్నం క్రిటిక్స్ రివ్యూల‌తో బ్యాడ్ చేశార‌ట‌. రెండో రోజు అస్స‌లు క‌లెక్ష‌న్లు లేవ‌ట‌. కానీ మూడో రోజు, నాలుగో రోజు క‌లెక్ష‌న్లు పెరిగాయ‌ట‌. ఇలా ఏదో ఏదో చెప్పుకుంటూ వ‌చ్చాడు సీనియ‌ర్ నిర్మాత దిల్‌రాజు. పాపం ఈ సినిమా ఆయ‌న్ని నిజంగానే అయోమ‌యంలో ప‌డేసింది.

దిల్‌రాజు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

''15 సంవత్సరాలు.. 30 సినిమాలు చేశాను. ఈరోజు ఉన్నంత కన్‌ఫ్యూజన్‌లో ఎప్పుడూ లేను. ఇన్నేళ్ల కెరీర్‌లో సక్సెస్‌ పర్సంటేజ్‌తో ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడప్పుడు స్పీడు బ్రేకులు వచ్చాయి. అలా వచ్చినప్పుడల్లా మళ్లీ సక్సెస్‌ సాధిస్తూ వస్తున్నాను. లక్కీగా గత ఏడాది ఇండస్ట్రీలోఎవరూ చేయలేని విధంగా ఆరు సినిమాలు చేశాను. అన్ని సినిమాలు సక్సెస్‌ఫుల్‌ అయ్యాయి. మూడు వారాల క్రితం వచ్చిన లవర్‌ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఈ సినిమా విషయంలో ముందు నుండి ఓ మంచి సినిమా వస్తుందని పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వచ్చాయి. ప్రివ్యూ సినిమా చూసినవారు అప్రిషియేట్‌ చేసినప్పుడు మాకు మంచి సినిమా చేశామని ఇంకా నమ్మకం పెరిగింది. యు.ఎస్‌ నుండి తొలి రివ్యూ వచ్చిన తర్వాత అది కూడా పాజిటివ్‌గానే వచ్చింది. అందరూ చెప్పినట్లుగా మంచి సినిమా చేశామని నమ్మకం కలిగింది. 80-90 శాతం మందికి సినిమా నచ్చిందని అనిపించింది. సినిమా పూర్తయిన తర్వాత.. మధ్యాహ్నం నుండి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చేసింది. యూత్‌, రివ్యూవర్స్‌, అందరూ సోషల్‌ మీడియాలో మిక్స్‌డ్‌ వార్తలు స్ప్రెడ్‌ చేశారు

గురువారం, శుక్రవారం సినిమా కలెక్షన్స్‌ పడిపోయాయి. అయితే శనివారం, ఆదివారం ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎక్కువ మంది థియేటర్స్‌కు వచ్చారు. సినిమా బావుందని అన్నారు. కొందరేమో బావుంది.. ఇలాంటి సినిమాలే చేయమని అన్నారు. కొందరేమో మరోలా అన్నారు. అని ఆలోచించాను.

మేం చేసింది తప్పా.. ఒప్పా.. అని ఆలోచించి టైటిల్‌తో ఉన్న కార్డుని ప్రింట్‌ చేయించాను. అందులో పరావాలేదు.. బాగుంది.. చాలా బాగుంది.. బాగా లేదు.. అనే చాయిస్‌లను ప్రింట్‌ చేయించాను. రెండు రాష్ట్రాలో 60-70 థియేటర్స్‌కు ఈ కార్డ్స్‌ను పంపి ఆడియెన్స్‌ ఎలా స్పందిస్తున్నారో ఇంటర్వెల్‌లో తెలుసుకోమని పంపాను. ప్రేక్షకుల కామెంట్‌తో పాటు పేరు, కాంటాక్ట్‌ నెంబర్‌ కూడా తీసుకున్నాం. ఆరు షోలకు స్పందనను తెప్పించాను. యూత్‌, సోషల్‌ మీడియాతో పోల్చిఇతే ఆడియెన్స్‌ పల్స్‌ ఒకలా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ చేస్తే పక్కకు వెళ్లిపోతామని.. మేం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేశాం. అయితే అందరూ మెచ్చుకునేలా సినిమా చేయాలని నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఈ సినిమాను మౌత్‌ టాక్‌తో ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను.