6 వేళ్లు... పుష్ప ఎట్రాక్షనా?

What is main attraction of Pushpa?
Wednesday, April 15, 2020 - 13:00

హృతిక్ రోషన్  చేతికి 6 వేళ్లు ఉంటాయి. తన మొదటి సినిమాకే ఈ విషయాన్ని అతడు బయటపెట్టాడు. దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు బన్నీకి కూడా 6 వేళ్లు ఉన్నాయి. హృతిక్ రోషన్ చేతికి 6 వేళ్లు ఉంటే.. బన్నీ కాలికి 6 వేళ్లు ఉన్నాయి. పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ విషయం బయటపడింది.

అయితే బన్నీకి నిజంగానే 6 వేళ్లు ఉన్నాయా.. లేక పుష్ప సినిమాలో ఇదే మెయిన్ పాయింటా అనేది తేలాల్సి ఉంది. మూవీలో మెయిన్ ట్విస్ట్ అదే అయి ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలువుతుంది అనేది ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఎందుకంటే ... లాక్ డౌన్ పూర్తి అయ్యే షూటింగ్ లు మొదలయ్యే సరికి జూన్ అవుతుంది. 

ఈ సినిమా కథ ప్రకారం అడవుల్లో తీయాలి... జూన్, జులై నెలల్లో వర్షాలు మొదలైతే.. ఫారెస్ట్ లో తీయడం కష్టం. సో షూటింగ్ కి ఇబ్బందే.