సోనూ దగ్గర ఎంత డబ్బుంది?

What is the net worth of Sonu Sood?
Wednesday, July 29, 2020 - 09:30

లాక్ డౌన్ ఇలా పడిందో లేదో సోనూ సూద్ అలా హీరో అయిపోయాడు. వలస కార్మికుల్ని ఆదుకోవడం, అన్నదానం చేయడం, కార్మికులను వాళ్ల సొంతూళ్లకు పంపించడం, తన హోటల్ ను మెడికల్ సిబ్బందికి ఇచ్చేయడం.. ఇలా చేతికి ఎముకే లేనట్టు దానాలు చేస్తున్నాడు సోనూ సూద్. దీంతో ఇప్పుడు అతడి ఆస్తిపై అందరి దృష్టి పడింది.

దాదాపు 3 నెలలుగా ప్రతి రోజూ దానాలు చేస్తున్న సోనూ సూద్ కు అసలు ఎంత ఆస్తి ఉందనే చర్చ ఊపందుకుంది. సోనూ దాదాపు 15 ఏళ్లుగా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాపులర్ నటుడు. తన క్రేజ్ కు తగ్గట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. దీనికి తోడు అతడికి హోటల్ బిజినెస్ కూడా ఉంది. ఇవి కాకుండా వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సోనూ సూద్ కు  అటుఇటుగా 130 కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చని ఓ అంచనా.

అయితే సోనూ సూద్ కు ఎంత ఆస్తి ఉందనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆయనకు ఎంత పెద్ద మనసు ఉందనేది ఇంపార్టెంట్. సోనూ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆస్తి ఉన్న స్టార్స్ ఇండియాలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్లందరికంటే ఇప్పుడు సోనూనే హీరో అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యం డబ్బు కాదు. ఆ చొరవ, ఆ మంచితనం. అదే ఇప్పుడు సోనూను హీరోను చేసింది.