చెర్రీకి సమంత ప్రామిస్‌

What is the promise that Samantha made to Ram Charan?
Tuesday, July 4, 2017 - 15:00

కెరీర్ లో ఫస్ట్ టైం రామ్ చరణ్ తో సినిమా చేస్తోంది సమంత. అక్టోబర్ 6న నాగచైతన్యను పెళ్లాడనుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించింది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. సమంత రామ్ చరణ్ కు ఒక ప్రామిస్ చేసిందట.

ప్రస్తుతం సమంత చేతిలో చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో రాజుగారి గది 2 మాత్రమే ఓ కొలిక్కి వచ్చింది. మిగతా సినిమాలన్నీ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో పెళ్లి పెట్టుకుంది సమంత. అక్టోబర్ లో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తిరిగి సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వాలనేది సమంత ప్లాన్.

కానీ రంగస్థలం కోసం వీలైన‌న్ని డేట్స్ ఇస్తాన‌ని చెర్రీకి మాటిచ్చిందట సమంత. రంగస్థలం సినిమాను సంక్రాంతి కానుక‌గా విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే ఆమె పెళ్లి కోసం ఎక్కువ రోజులు సెల‌వు తీసుకుంటే ఈ సినిమాకి స‌మ‌స్య వ‌స్తుంది. అందుకే రంగ‌స్థలం సినిమాకి ప్రియారిటీ డేట్స్ ఇస్తాన‌ని మాటిచ్చింద‌ట‌. అయితే సుకుమార్ అండ్ టీమ్ మాత్రం వీలైనంత వ‌ర‌కు అక్టోబ‌ర్‌లోపే ఆమెకి సంబంధించిన సీన్లు తీసేయాల‌నుకుంటున్నార‌ట‌.

సుకుమార్ ఒరిజిన‌ల్ ప్లాన్ ప్ర‌కారం ఈ మూవీని జులై చివ‌రిలోపు పూర్తి చేయాలి. ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయాల‌నుకున్నారు నిర్మాత‌లు. అయితే ఏప్రిల్‌, మే నెల‌లో ఎండ‌లు అద‌ర‌గొట్ట‌డంతో షూటింగ్ జ‌ర‌గ‌లేదు. సినిమా అంతా ఔట్‌డోర్‌లోనే. అది కూడా పెద్ద‌గా ఫెసిలిటిస్ లేని మారుమూల గోదావ‌రి తీర ప్రాంతంలో. దాంతో వేస‌వి షెడ్యూల్ అంతా తారుమారు అయింది. పెళ్లిలోపే మూవీ విడుద‌ల అవుతుంద‌ని స‌మంత ఈ సినిమాని సైన్ చేసింది. అయితే షూటింగ్‌లో జాప్యం కార‌ణంగా రిలీజ్ డేట్ మారినా..  ఈ మూవీకి ఆమె స్పెష‌ల్ ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకే డేట్స్ విష‌యంలో ఇబ్బంది పెట్ట‌న‌ని మాటిచ్చింద‌ట ఈ చుల్‌బులీ.