ఎన్టీఆర్ గెటప్ వెనక సీక్రెట్

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ ఫస్ట్ లుక్ విడుదలైంది. మొన్నటివరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పై చాలా స్పెక్యులేషన్ నడిచింది. సినిమాలో తారక్ 3 గెటప్స్ లో కనిపించనున్నాడు కాబట్టి.. ఆ మూడు గెటప్స్ లో ఏ గెటప్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అని అంతా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఓ లుక్ తో జై లవకుశ ఫస్ట్ లుక్ వచ్చేసింది. మరి అందులో ఉన్నది ఎవరు..? ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో ఏ గెటప్ కు సంబంధించిన లుక్ ఇది.
ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నఒక పాత్ర పేరు జయకుమార్ ..సింపుల్‌గా జై. ఈ గెటప్ జై పాత్రది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ల పేరు జై, లవకుమార్, కుశాల్. ఈ మూడు పాత్రల్లో జై క్యారెక్టర్ నెగెటివ్ ఛాయల్లో ఉంటుందట. ఆ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ నే తాజాగా విడుదల చేసినట్టు టాక్.
బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాశిఖన్నా, నివేదా థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కల్యాణ్‌రామ్ దీనికి నిర్మాత.
- Log in to post comments