పాకిస్థాన్ క్రికెటర్ తో మిల్కీబ్యూటీ?

What's happening in Tamannah's personal life?
Monday, May 4, 2020 - 14:30

కొన్ని పుకార్లు ఎప్పుడు ఎలా పుడతాయో అస్సలు అర్థంకావు. తీరా అవి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత సదరు సెలబ్రిటీ ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. తమన్న విషయంలో ఇప్పుడిది నిజమైంది. ఊహించని విధంగా తనకు సంబంధించిన ఓ ఫొటో బయటకు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది తమ్ము.

పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్, తమన్న కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారట. దీనికి సాక్ష్యంగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో తమన్న, రజాక్ గోల్డ్ షాపింగ్ చేస్తున్నారు. ఫొటో బయటకొచ్చిన వెంటనే తమన్న టీమ్ ఎలర్ట్ అయింది.

అబ్దుల్ తో తమన్న డేటింగ్ చేయడం లేదని స్పష్టంచేసింది. దుబాయ్ లో ఓ గోల్డ్ షోరూమ్ ఓపెనింగ్ కు తమన్న గెస్ట్ గా హాజరైందని, అదే ఓపెనింగ్ కు రజాక్ కూడా వచ్చాడని.. అలా ఇద్దరూ కలిసి ఫొటో దిగారని స్పష్టంచేసింది. తను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని, ఎవ్వరితో డేటింగ్ చేయడం లేదని రీసెంట్ గా తమన్న కూడా స్పష్టంచేసింది. తను మ్యారీడ్ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి మరికొన్నేళ్లు పడుతుందని కూడా చెప్పుకొచ్చింది.