పువ్విచ్చిన భామ, సిగ్గుపడ్డ మణిరత్నం

When Mani Ratnam blushes
Tuesday, April 7, 2020 - 21:15

దేహ చింతన లేని దర్శకరత్నం మణిరత్నం అని రాశారు వేటూరి. ఈ గ్రేట్ డైరక్టర్ సినిమాల గురించి తప్ప మరోటి ఆలోచించారు. అయన జీవన శైలి, ఆయన సినిమాలు ప్రత్యేకం. అందుకే ఆయన్ని దేశంలో ఉన్న హీరో, హీరోయిన్లు అందరూ గౌరవిస్తారు. హీరోయిన్ అదితి రావుకి కూడా మణిరత్నం అంటే ప్రత్యేక అభిమానం. ఆయన సినిమాల్లో నటించిన తర్వాతే ఆమె కెరీర్ దక్షిణాదిలో మలుపు తిరిగింది. మూడేళ్ళ క్రితం ఆయన తీసిన "చెలియా" సినిమాలో అదితి నటించింది. 

తాజాగా ఈ అమ్మడు ఒక పాత ఫోటో పోస్ట్ చేసింది. ప్రేమగా మణిరత్నంకి పువ్వు అందిస్తూ లవ్ యు అని చెప్తున్న ఆ పిక్ అది. సినిమా లొకేషన్ లో సరదాగా చేసిన ఫీట్ అది. ఆ ఫోటోని ఇప్పుడు షేర్ చేసింది. అందులో మణిరత్నం సిగ్గు పడుతూ కనిపించారు. దానికి ఆర్జీవీ మణిరత్నంని ఆటపట్టిస్తూ ఒక కామెంట్ కూడా చేశారు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్.