ప్ర‌భాస్ బిర్యానీలు కుమ్మేశాడు!

When Prabhas had many plates of biryani at one go!
Monday, June 5, 2017 - 16:45

ప్రభాస్ కు నాన్-వెజ్ అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. అర్థరాత్రి నిద్రలేపి బిర్యానీ పెట్టినా ఓ పట్టు పట్టేస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు ప్రభాస్. అలాంటి హీరో బాహుబలి సినిమా కోసం బిర్యానీని త్యాగం చేశాడు. శివుడు పాత్ర కోసం బాడీ వెయిట్ ను కంట్రోల్ లో ఉంచేందుకు ప్రభాస్ బిర్యానీని త్యాగం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సెట్స్ లో ఓ రోజంతా ప్రభాస్ బిర్యానీ లాగించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

బాహుబలి షూటింగ్ టైమ్ లో ఓ రోజు సెట్స్ లో “సర్ ప్రైజ్ మీల్” అనే కార్యక్రమం ఏర్పాటుచేశారట. ఆ ఈవెంట్ ఉద్దేశమేంటంటే.. యూనిట్ లో ఎంతమంది ఎన్ని నియమాలు పాటించినప్పటికీ.. ఆ ఒక్కరోజు మాత్రం తమకు నచ్చిన భోజనాన్ని కడుపునిండా తినేయొచ్చన్నమాట. ఈ ఒక్క అవకాశాన్ని ఫుల్లుగా వాడుకున్నాడట ప్రభాస్. ఏకంగా 15 రకాల బిర్యానీలు తెప్పించుకుని తిన్నాడట. బిర్యానీ తినడం ఫుట్ బాల్ ఆడడం, మళ్లీ బిర్యానీ తినడం రోజంతా ఇదే పని పెట్టుకున్నాడట. అసలు ప్రభాస్ తెప్పించుకున్నంతవరకు బిర్యానీలో అన్ని రకాలు ఉన్నాయని తమకు తెలియదంటున్నాడు నిర్మాత శోభు. బ్రిటన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ ఎలాంటి ఆహార నియమాలు పెట్టుకోలేదు. నచ్చిన ఫుడ్ తింటూనే మరోవైపు కాస్త స్లిమ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. సాహో సినిమా కోసం ఈ హీరో ఇప్పటికే కాస్త మేకోవర్ అయ్యాడు.