నాని సినిమాకి ఇంకా దక్కని డేట్

When will Nani's Gang Leader be released?
Wednesday, August 7, 2019 - 08:30

నాని హీరోగా రూపొందుతోన్న "గ్యాంగ్ లీడర్" సినిమా ఇప్పటికే టీజర్ ని విడుదల చేసింది. ఐతే ఈ సినిమాకి సంబంధించిన కొత్త విడుదల తేదీ విషయంలో ఇటు నాని, అటు నిర్మాతలు నోరు విప్పడం లేదు. ఈ సినిమాని ఆగస్ట్ 30న రిలీజ్ చేస్తామని ఇంతకుముందు హడావుడిగా ప్రకటించారు. ఐతే ప్రభాస్ నటించిన సాహో ...ఏ వచ్చి బీపై వాలే . అన్నట్లు 15 నుంచి వచ్చి 30న వాలింది.

ప్రభాస్ వల్ల తమిళ్ హీరో సూర్య వంటి బిగ్ స్టారే తన సినిమా డేట్స్ మార్చుకోకతప్పలేదు. తన బందోబస్తీ మూవీని ఏకంగా 20 రోజుల వెనక్కి పోస్ట్ పోన్ చేశాడు సూర్య. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 20కి వెళ్లింది. మరి.. నాని నటించిన గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటి? సెప్టెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట.

సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న "వాల్మీకీ" విడుదల కానుంది. సెప్టెంబర్ 20న "బందోబస్త్", అక్టోబర్ 2న "సైరా". పనిలో పనిగా సందు చేసుకొని దూరుదామని వెంకీ మామా రెడీగా ఉన్నాడు. సో... గ్యాంగ్ లీడర్ కి సెప్టెంబర్ 12 తప్ప మరో దారి కనిపించడం లేదు.