మొత్తానికి విజయ్ కి పట్టు దక్కింది

Whistle takes superb openings
Saturday, October 26, 2019 - 11:45

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఏంతో కాలంగా తెలుగు మార్కెట్ లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అదిరింది సినిమాతో మంచి ఓపెనింగ్ ని తెచ్చుకున్నాడు. ఆ సినిమా ముందు తమిళంలో విడుదల అయి ... ఆ తర్వాత తెలుగులో వచ్చింది. రిలీజ్ కి ముందు చాలా వివాదాలు చెలరేగాయి. దాంతో  మంచి ఓపెనింగ్ వచ్చింది అప్పుడు. కానీ ఆ ఊపును తర్వాత కంటిన్యూ చెయ్యలేదు.

ఇప్పుడు మార్కెట్ మరింత మెరుగైంది అతనికి. తాజాగా విడుదలైన 'విజిల్' సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 2.70 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంటే విజయ్ కెరీర్లో ఇది బెస్ట్ ఓపెనింగ్. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ బాగున్నాయి అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి వీకెండ్ అంతా ఇదే ఊపు చూపుతుందా అనేది చూడాలి. 

ఇది లాభాలు తెచ్చిపెడితే... ఆ తర్వాత విజయ్ సినిమాలకి డిమాండ్ పెరుగుతుంది.