మహేష్ సినిమాకు నిర్మాతలెవరు?

Who are the prod
Saturday, April 4, 2020 - 20:00

మహర్షి సినిమాకు నిర్మాత ఎవరంటే ఠక్కున చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ సినిమాకు వర్కింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. స్లీపింగ్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. ఇన్-యాక్టివ్ ప్రొడ్యూసర్ పీవీపీ. ఇలా ముగ్గురు కలిసి నిర్మించిన సినిమా అది. ముందే వాటాలు అనుకొని ఆ తర్వాత ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లారు. సరిగ్గా ఇలాంటి సిచ్యుయేషనే ఇప్పుడు మహేష్ కొత్త సినిమాకు కూడా వచ్చింది.

పరశురామ్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమాకు మెయిన్ ప్రొడ్యూసర్ మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ నిర్మాతలు (నవీన్, రవిశంకర్) కాకుండా 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీ ఆచంట కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నారు. ఎందుకంటే, దర్శకుడు పరశురామ్ కు ఒరిజినల్ నిర్మాతలు వాళ్లే. వీళ్లు కాకుండా కొరటాల శివకు కూడా చిన్నపాటి వాటా లేదా కొంత ఎమౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే.. పరశురామ్-మహేష్ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కారణం కొరటాల.

వీళ్లతో పాటు ఈ సినిమాకు మహేష్ బాబు కూడా సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. వీళ్లంతా మహేష్ కు అత్యంత సన్నిహితులు కాబట్టి నిర్మాణం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.