దర్శకుడు టార్గెట్ చేసిన ఆంటీ ఎవరు?

Who is that Aunty in Tenali Ramakrishna?
Saturday, November 16, 2019 - 15:00

ఆంటీ అని పిలిస్తే చాలు ... చావగొడుతుంది వరలక్ష్మి. ఆంటీ అనే పదం అంటే అంత విరక్తి ఆమెకి. తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ సీన్ పండింది. ఆంటీ అంటూ సప్తగిరి పిలవడం, ఒళ్లు హూనం చేయించుకోవడం లాంటి ఎపిసోడ్ సినిమాలో ఉంది. అయితే ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరు ఇది ఎవర్నో టార్గెట్ చేసి పెట్టారని చర్చించుకుంటున్నారు.

మొన్న ఆ మధ్య ఒక బాలీవుడ్ హీరోయిన్ ఇలాగే  'ఆంటీ'  కాంట్రవర్సీ లో ఇరుక్కుంది. కానీ అప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది... కాబట్టి ఆమెను ఉద్దేశించి ఈ పేరడీ పెట్టారని అనుకోలేం. కచ్చితంగా నాగేశ్వర రెడ్డి ఎక్కడో తన గత సినిమాల షూటింగ్ స్పాట్ లోనో, లేదా నిర్మాత ఇంట్లోనో అలాంటి హీరోయిన్ ని చూసి పెట్టి ఉంటాడని అంటున్నారు చాలామంది.

నిజానికి బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఆంటీ వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. ఆంటీ వయసొచ్చినా, పిల్లలు పెద్దవాళ్లు అయినా ఆంటీ అని పిలిస్తే వాళ్లు ఒప్పుకోరు. నలుగురు ఉన్నారని కూడా చూడకుండా చెడామడా తిట్టేస్తారు. మరి వాళ్లను దృష్టిలో పెట్టుకొని నాగేశ్వర్ రెడ్డి ఈ ఎపిసోడ్ పెట్టాడేమో అనుకోవాలి.

ఓవరాల్ గా ఒకటి మాత్రం నిజం. ఇండస్ట్రీలో చూసిన ఘటనల ఆధారంగానే నాగేశ్వరరెడ్డి ఈ ఎపిసోడ్ రాసుకున్నాడు. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆంటీ పదానికి యాంటీగా ఉండే ఆ బ్యూటీ ఎవరయి ఉంటారబ్బా?