ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎవరు?

Who is director of RRR?
Monday, February 24, 2020 - 18:30

ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎవరు? ప్రశ్న చాలా సింపుల్. సమాధానం ఎవర్ని అడిగినా చెబుతారు.

కానీ ఇదే ప్రశ్న గూగుల్ ను మాత్రం అడగొద్దు. కచ్చితంగా షాక్ అవుతారు. అవును.. గూగుల్ లో ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎవరనే ప్రశ్నకు ఇద్దరు దర్శకుల పేర్లు వస్తున్నాయి. ఒకటి రాజమౌళి కాగా, రెండో దర్శకుడి పేరు కింద సంజయ్ పాటిల్ పేరు కనిపిస్తోంది. దీంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ సంజయ్ పాటిల్ ఎక్కడ్నుంచి వచ్చాడు, అసలు ఎవరు అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు.

నిన్నట్నుంచి గూగుల్ లో ఆర్ఆర్ఆర్ దర్శకుడి పేరు కింద రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ పేరు చక్కర్లు కొడుతోంది. దీంతో ఇదొక పెద్ద వార్తగా మారిపోయింది. నిజానికి ఇది కేవలం ఓ టెక్నికల్ సమస్య మాత్రమే. సెర్చ్ ఇంజిన్, కీవర్డ్స్ లో తికమక వల్ల ఈ తప్పిదం జరిగి ఉంటుంది.

కారణం ఏదైనా గూగుల్ లో ఆర్ఆర్ఆర్ కు సంబంధించి వస్తున్న సమాచారం మాత్రం తప్పు. దీన్ని సినిమా యూనిట్ సరిదిద్దుతుందేమో చూడాలి.