ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్ ఎవరు?

Who is number one in Tollywood now?
Thursday, May 18, 2017 - 10:00

మామూలుగా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా ఈజీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్వశ్చన్ కు ఠక్కున ఆన్సర్ చెప్పడం మాత్రం కాస్త కష్టమైన పనే. బాహుబలి-2 సూపర్ హిట్ అయింది కాబట్టి అనుష్క ను నంబర్ వన్ అందామా..? లేక కన్సిస్టెంట్ గా హిట్స్ ఇస్తోంది కాబట్టి సమంతను నంబర్ వన్ అందామా..? వీళ్లిద్దరూ కాకుండా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ను నంబర్ వన్ అందామా..? ఇలా టాలీవుడ్ లో ప్రస్తుతం ఎవరు నంబర్ వన్ హీరోయిన్ అనే విషయం చెప్పడం కష్టంగా మారింది.
 
బాహుబలి-2 యూనివర్సల్ హిట్. ఇందులో నటించిన అనుష్కకు ఎనలేని పేరుప్రఖ్యాతులు వచ్చాయి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కాకపోతే బాహుబలి-2 సినిమాను మాత్రమే కొలమానంగా తీసుకొని అనుష్కకు నంబర్ వన్ అప్పగించేద్దామా.. అంతకుముందు ఆమె చేసిన ఓం నమో వేంకటేశాయ, సింగం-3 సినిమాల రిజల్ట్స్ పక్కనపెట్టేద్దామా..
 
ఇక సమంత విషయానికొస్తే ఈ అమ్మడిది మరో పరిస్థితి. అ..ఆ, జనతా గ్యారేజ్ సినిమాలు హిట్ అయినప్పటికీ.. అంతకుముందొచ్చిన సినిమాలు ఆడలేదు. పోనీ ఆ విషయాన్ని పక్కనపెడితే ఈ ఏడాది ఇప్పటివరకు సమంత నుంచి మరో సినిమా రాలేదు. మరి ఈ రెండు సినిమాల ప్రాతిపదికనే సమంతకు నంబర్ వన్ ఇచ్చేద్దామా..?
 
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి. చెప్పుకోదగ్గ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ అదే రేంజ్ లో ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. పైగా అనుష్క, సమంతను కాదని రకుల్ ను నంబర్ వన్ గా ప్రకటించే సాహసం ఎవరూ చేయరు. ఈ ఈక్వేషన్స్ అన్నీ నలుగుతున్నాయి కాబట్టే.. ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు.