ఎవరివి నిజాలు, ఎవరివి ఫేకులు?

Who is right and who is wrong in quoting collections
Sunday, January 19, 2020 - 12:00

గత కొంతకాలంగా అన్ని వెబ్సైటులు అటు ఇటుగా అన్ని సినిమాల కలెక్షన్లని అప్డేట్ చేస్తూ వస్తున్నాయి. లక్షల్లో తేడా తప్పితే... దాదాపుగా ట్రేడ్ సైట్స్ కొంత నిజాలు పబ్లిష్ చేస్తూ వస్తున్నాయి. ఐతే ఇప్పుడు అవి కూడా చేతెలెత్తేశాయి. 
 
అమెరికాలో లా మన దగ్గర ఇంకా ఒక పర్ఫెక్ట్ సిస్టం ఏర్పడలేదు. ఒక్కో సినిమాకి ఒక్కో పద్దతిని ఫాలో అవుతున్నారు. ట్రాకింగ్ సిస్టం లేకపోవడంతో ఏ ట్రేడ్ వెబ్సైటుని పక్కాగా నమ్మే పరిస్థితి లేదు. దీన్నే కాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. రికార్డుల కోసం భారీగా ఫిగర్లు వేస్తూ పోస్టర్లు వేస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న ఫ్యాన్ వార్స్... తాజాగా విడుదల అయిన "సరిలేరు నీకెవ్వరు", "అల వైకుంఠపురంలో" సినిమాలతో మళ్లీ మొదలయ్యాయి. ఇందులో ఎవరు తక్కువ తినలేదు. రెండు వర్గాలు వచ్చిన కలెక్షన్ల కన్నా ఎక్కువ చెప్తున్నాయి. 

"హైర్ లు, ఫిక్స్డ్ డిపాజిట్ లని కలిపి కలెక్షన్ల ఫిగర్లు చెప్పడం ఏంటి?" అని ఆ మధ్య దిల్ రాజు ఈసడించుకున్నా ... పరిస్థితి మారలేదు. ఈ లొల్లి అంతా పోవాలంటే గ్రాస్ ఫిగర్లు మాత్రమే కన్సిడర్ చెయ్యడం మొదలు పెట్టాలి.

ఇంతకీ ఎవరివి నిజాలు, ఎవరివి ఫేకులు? రెండు సినిమాలు సంక్రాంతి సెలవులు, వీకెండ్ ని బాగా కాష్ చేసుకున్నాయి. రెండు సినిమాలు 100 కోట్ల పైనే వసూళ్లు అందుకునే సినిమాలుగా నిలబడనున్నాయి. ఇందులో "అల వైకుంఠపురంలో" వసూళ్లు కొంత ఎక్కువ ఉన్నాయి. అయితే, ఫేకడంలో ఇద్దరూ తగ్గడంలేదు.