"హారర్ స్టార్" శ్రీనివాసరెడ్డి!

Who termed Srinivas Reddy as Horror Star?
Tuesday, December 3, 2019 - 19:00

హీరో అల్లు అర్జున్, కమెడియన్ శ్రీనివాసరెడ్డి మధ్య మంచి అసోసియేషన్ ఉందనే విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అదే చనువుతో ఓ సందర్భంలో శ్రీనివాసరెడ్డిని బాగా ఆటపట్టించాడు బన్నీ. ఆ విషయాన్ని శ్రీనివాసరెడ్డి స్వయంగా వెల్లడించాడు.

"గీతాంజలి పెద్ద హిట్టయింది. అందులో నేనే హీరో.  ఆ తర్వాత ఆనందో బ్రహ్మ కూడా హిట్ అయింది. అందులో కూడా నేనే హీరో. ఆ రెండూ హారర్ సినిమాలే. దీంతో నాకు వరుసగా హారర్ సినిమా ఆఫర్లే రావడం మొదలయ్యాయి. ఆ విషయం తెలుసుకున్న బన్నీ ఓసారి నాకు కాల్ చేశారు. నువ్వులా వరుసగా హారర్ సినిమాలు చేస్తే, ఏదో ఒక రోజు హారర్ స్టార్ అయిపోతావంటూ సెటైర్ వేశారు. అది సెటైరా లేక కాంప్లిమెంటా అనేది నాకు అర్థం కాలేదు."

అయితే బన్నీ ఫోన్ కాల్ ను మాత్రం తను చాలా సీరియస్ గా తీసుకున్నానని, హారర్ సినిమాలు తగ్గించానని చెప్పుకొచ్చాడు. 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాలు వెల్లడించిన శ్రీనివాసరెడ్డి.. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉండవని స్పష్టంచేశాడు.