ర.ర భామ‌లు ఎవ‌రు?

Who will act as heroines in Rajamouli's multi-starrer?
Wednesday, June 27, 2018 - 00:15

వంశీ తీసిన "లేడీస్ టైల‌ర్" సినిమా గుర్తుందా? అందులో తొడ‌పై మ‌చ్చ ఉన్న భామ గురించి హీరో వెతుకుతుంటాడు. దానికి ముద్దుగా జ‌మ జ‌చ్చ అంటాడు. జ భాష అన్న‌మాట‌. అంతే కాదు, "మ‌చ్చ ఉన్న భామ క‌నుల‌కి క‌న‌రావా" అంటూ ఓ సాంగ్ కూడా వేసుకుంటాడు. 

అదే పంథాలోరాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ సినిమాల విష‌యంలో ర భాష వాడుతున్నార‌ట‌. 

రాజ‌మౌళిలో ఆర్‌, తార‌క రామారావులోని ఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లోని ఆర్ అక్ష‌రాల‌ను తీసుకొని ఈ సినిమాకి ఆర్‌.ఆర్‌.ఆర్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ని కూడా వ‌దిలారు. అస‌లు టైటిల్ వ‌చ్చే వ‌ర‌కు ఈ కొస‌రుతో పిలుచుకోవాలి. దాంతో అభిమానులు.. హీరోయిన్ల‌ని కూడా ఆర్ అనే అక్ష‌రం ఉన్న సుంద‌రాంగుల‌నే సెర్చ్ చేస్తార‌నుకుంటున్నారు. ర‌క‌ర‌కాల పేర్ల‌ను అల్లేస్తున్నారు. కానీ రాజ‌మౌళికి మాత్రం హీరోయిన్ల విష‌యంలో అలాంటి ప‌ట్టింపులు ఏమీ లేవు.

రెజీనా, ర‌కుల్‌, రాశి ఖ‌న్నా,  ర‌ష్మిక వంటి వారు మాత్ర‌మే తెలుగులో ఉన్నారు. ఇందులో ఎవ‌రికీ ఛాన్స్ వ‌చ్చినా వారికి పంట పండిన‌ట్లే. ఐతే, రాజ‌మౌళి మ‌రి ర భాష రాయాల‌నుకుంటున్నాడా అనేది డౌటే.