కీరవాణా? రెహమానా?

Who will compose music for Prabhas21?
Monday, July 27, 2020 - 13:45

"సాహో" సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పని చేశారు. "రాధే శ్యామ్"కి కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నారు అని టాక్. మరి ప్రభాస్ 21వ చిత్రానికి  ఎవరు సంగీతం అందిస్తారు? "మహానటి" దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరో గా తీసే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పేరు అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి మ్యూజిక్ డైరక్టర్ పేరు ఎప్పుడు ప్రకటిస్తారో.

మహానటి సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె మేయర్ ని రిపీట్ చేసే అవకాశాలు తక్కువే. దర్శకుడు ఛాయస్ ఐతే మిక్కీ జె మేయర్. కానీ పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున తీస్తున్న ఈ మూవీకి జాతీయ స్థాయిలో పేరున్న టెక్నిషియన్లు తీసుకుంటే బాగుంటుంది అనేది మరో ఆలోచన. హీరోయిన్ గా దీపికా పదుకొనెని తీసుకున్నదే అదే కారణంతో.

ఏ.ఆర్.రెహ్మాన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతర్జాతీయంగా పేరున్న మ్యూజిక్ కంపోజర్ రెహ్మాన్. ఐతే, బడ్జెట్ వంటి పరిమితులు కూడా చూసుకోవాలి. మరో ఆప్షన్ గా మన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి పేరు కూడా పరిశీలనలో ఉంది. "బాహుబలి" తర్వాత కీరవాణి మ్యూజిక్ మేజిక్ తేలినవారు ఇండియాలో లేరు. సో... రెహ్మాన్ అయినా, కీరవాణి అయినా... ఈ బిగ్ ప్రాజెక్ట్ కి సూట్ అయ్యేవారే. మరి నాగ్ అశ్విన్ ఎవరిని తీసుకుంటాడో చూడాలి. ప్రభాస్ ఆలోచన ఎలా ఉందో!