ఇంత‌కీ 'ఆయ‌న' ఎవ‌రు?

Who will Sunitha be marrying?
Thursday, July 19, 2018 - 20:15

బ్యూటీఫుల్ సింగ‌ర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతుంద‌న్న ప్ర‌చారం ఒక్క‌సారిగా గుప్పుమంది. మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ హ‌ల్‌చ‌ల్ అయింది. దాంతో ఈ ప్ర‌చారంపై స్పందించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితిలోకి వెళ్లింది గాయ‌ని సునీత‌. ఐతే ఆమె ఈ ప్ర‌చారాన్ని త‌ప్ప‌ని చెప్ప‌లేదు. అలాగ‌నీ రెండో పెళ్లి చేసుకుంటున్నా అని కూడా ఒప్పుకోలేదు.

వ్య‌క్తిగ‌త విష‌యాలు మీకెందుకు అన్న‌ట్లుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఆమె పోస్ట్ చేసిన త‌ర్వాతే జ‌నాలు ఇంకా ఎక్కువ‌గా స్పెక్యులేట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆమె మొద‌టి పెళ్లి చాలా కాలం క్రిత‌మే ఎండ్ అయింది. ఇప్ప‌టికీ చెర‌గ‌ని అందంతో క‌నిపిస్తుంటుంది. ఆమె చాలా మంది పురుషుల‌కి డ్రీమ్ గాల్ అన‌డంలో సందేహంలేదు. ఆమె గాత్రానికి ఎంతగా అభిమానులున్నారు ఆమె అందానికి ప‌డిచచ్చేవాళ్లూ అంతే స్థాయిలో ఉన్నారు. అందుకే ఆమె రెండో పెళ్లి వార్త అంత‌గా క‌ల‌క‌లం రేపింది మ‌రి.

ఇంత‌కీ ఆమె ఎవ‌ర్ని చేసుకోబోతుంది? ఆమె కాబోయే భ‌ర్త ఎవ‌రు? అనే విష‌యంలో సోష‌ల్ మీడియాలో చాలా చ‌ర్చ జ‌రుగుతోంది. చాలా పేర్లు వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్‌లానే ఆమె కూడా ఈ విష‌యంలో దాగుడుమూత‌లు ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.