దీపికాని ఎలా ఒప్పించారు?

Why Deepika has signed Prabhas21
Sunday, July 19, 2020 - 18:30

దీపిక పదుకోన్.. టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్. ఏ హీరో అయినా ఓ మోస్తరు పెద్ద సినిమా చేస్తున్నాడంటే చాలు దీపిక పదుకోన్ పేరు లిస్ట్ లో చేరిపోయేది. మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి ఎంతోమంది హీరోల సినిమాల కోసం దీపికను ట్రై చేసినట్టు గతంలో ఎన్నో వార్తలు చూశాం.

వీటిలో 50శాతం పుకార్లు ఉంటే, మరో 50 శాతం నిజాలు కూడా ఉన్నాయి. దీపిక కోసం సిన్సియర్ గా ప్రయత్నించిన మేకర్స్ ఉన్నారు. అలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు తెలుగులో నటించేందుకు ఒప్పుకుంది దీపిక పదుకోన్. ప్రభాస్-నాగఅశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది.

ఈ సినిమాలో దీపిక నటించడానికి కారణాలు సుస్పష్టం. ఇది ప్రభాస్ సినిమా. బాలీవుడ్ లో ప్రభాస్ డిమాండ్ ఉన్న హీరో. అతడు బాక్సాఫీస్ కింగ్. పాన్-ఇండియా స్టార్. అందుకే దీపిక నటించడానికి ఒప్పుకుంది. పైగా ఇది పాన్-ఇండియా సినిమా. దీనికితోడు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ ఒప్పుకోవడంతో దీపిక నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఇలా అన్నీ సెట్ అవ్వడంతో దీపిక టాలీవుడ్ డెబ్యూ సాధ్యమైంది. లేకపోతే ఆమె ఒప్పుకునే రకం కాదు.