మరోసారి దేవిశ్రీ దూరమైనట్టేనా?

Why DSP name not announced?
Tuesday, October 8, 2019 - 22:00

మెగా కాంపౌండ్ లో ఓ భారీ సినిమా చేస్తే దానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే. చిరంజీవి, బన్నీ, చరణ్.. ఇలా హీరో ఎవరైనా వాళ్ల ఫస్ట్ చాయిస్ దేవిశ్రీ మాత్రమే. కానీ ఇప్పుడీ లెక్క తప్పుతున్నట్టు కనిపిస్తోంది. సైరా సినిమాకు దేవిశ్రీని తీసుకోలేదు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీకి కూడా దేవిశ్రీని పరిగణనలోకి తీసుకోలేదట మెగాస్టార్.

ఈరోజు కొరటాల, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా లాంఛ్ అయింది. చిరంజీవి భార్య సురేష్ క్లాప్ కొట్టి సినిమా స్టార్ట్ చేశారు. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ పేర్లు మాత్రమే ప్రకటించారు. కావాలనే సంగీత దర్శకుడి పేరును హోల్డ్ లో పెట్టారు. దీనికి కారణం దేవిశ్రీ కాకుండా ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారట.

నిజానికి దేవిశ్రీనే కనుక సెలక్ట్ చేసినట్టయితే, ఈరోజు లాంఛింగ్ కు అతడు తప్పకుండా వచ్చేవాడు. కానీ అలాంటిదేం జరగలేదు. మరోవైపు దేవిశ్రీ లేకుండా కొరటాల ఇప్పటివరకు సినిమా చేయలేదు. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా కొరటాల సినిమాలన్నింటికీ దేవిశ్రీనే సంగీతం. అలాంటిది ఇప్పుడు చిరంజీవి సినిమాకు దేవిశ్రీని తప్పించి వేరే వ్యక్తితో కొరటాల పనిచేస్తాడా అనేది కూడా అనుమానాస్పదం. ఈ అనుమానానికి సమాధానం వచ్చేనెలలో తెలిసిపోతుంది.