హిట్లు లేని గోపికి ఇన్ని ఆఫర్లా
Submitted by tc editor on Thu, 2019-09-26 15:51
Why Gopi Chand is getting so many films?
Thursday, September 26, 2019 - 15:45

గోపిచంద్ ఎడాపెడా సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఈ దసరాకి చాణక్య సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాపై ఏమాత్రం బజ్ లేదు. హైప్ లేదు. సినిమా హిట్టా ఫట్టా అనేది చూడకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో ఒకరు రవితేజ, మరొకరు గోపిచంద్. అందుకే చాణక్య గురించి ఎక్కడా హైప్ లేకున్నా... మరో రెండు కొత్త సినిమాలను లైన్లో పెట్టాడు.
గోపిచంద్ ఒక బ్లాక్‌బస్టర్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఐనా గోపిచంద్‌తో ఇన్ని సినిమాలు ఎలా ప్రొడ్యుస్ చేస్తున్నారు. అదొక మిస్టరీ. త్వరలోనే ఈ రెండు కొత్త సినిమాలు సెట్స్‌పైకి వెళ్తాయట. ఈసారి తమన్నతో కలిసి ఒక సినిమా చేయనున్నాడు.
- Log in to post comments