గోవా వెళ్లిన మహేష్.. కారణం అదే?

Why Mahesh Babu left for Goa?
Thursday, May 11, 2017 - 19:15

ప్రిన్స్ మహేష్ బాబు గోవా వెళ్లాడు. స్పైడర్ సినిమా షూటింగ్ లో బిజీ ఉంటాడనుకున్న మహేష్ సెడన్ గా గోవాలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా స్పైడర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుందనే వార్తల మధ్య ఇలా హఠాత్తుగా మహేష్ గోవా టూర్ ప్లాన్ చేయడం అనుమానాలకు తావిచ్చింది.

ఈ అనుమానాల్లో కాస్త నిజం కూడా ఉంది. సినిమా షూటింగ్ ఇంకాస్త ఆలస్యం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఆగస్ట్ లో కూడా స్పైడర్ రావట్లేదు. సెప్టెంబర్ లో డేట్ కోసం చూస్తున్నారట. క్వాలిటీ కోసం మురుగదాస్ పరితపించడం వల్లనే సినిమా లేట్ అవుతోందని టాక్. అందుకే మహేష్ కాస్త గ్యాప్ తీసుకొని గోవా వెళ్లిపోయాడు.

స్పైడర్ లేట్ అవుతోంది. ఇది పక్కా. మరి నెక్ట్స్ మూవీ పరిస్థితేంటి? ఈ డౌట్ కు కూడా చిన్నపాటి క్లారిటీ వచ్చేసింది. స్పైడర్ సినిమా కంప్లీట్ అయినా అవ్వకపోయినా.. ఈ నెలాఖరుకు నుంచి కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.