నితిన్‌కి ఆ ట్రిక్కు తెలియదా?

నితిన్ "అ ఆ" సినిమాతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. త్రివిక్రమ్ తీసిన ఆ సినిమా మామూలు బ్లాక్‌బస్టర్ కాదు. అమెరికాలో ఏకంగా 2.49 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లు)ను కొల్లగొట్టింది. నేచురల్‌గానే నితిన్‌కి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఏర్పడిందని అంతా అనుకున్నారు. అందుకే "లై" అమెరికాలో బాగా పే చేస్తుందని భావించారు డిస్ట్రిబ్యూటర్స్.. కానీ అందర్నీ షాక్‌కి గురి చేస్తూ ఆ సినిమా రానా సినిమా కన్నా తక్కువ ఓపెనింగ్స్‌ని రాబట్టింది. ఓవరాల్‌గా 300కే డాలర్లలోపే క్లోజ్ కానుంది. అంటే "అ ఆ" వసూళ్లల్లో ఇది 20 శాతం కూడా రాబట్టలేదు.
ఇంత దారుణమైన ఓపెనింగ్స్ చూసిన తర్వాత నితిన్ రేంజ్ ఏంటనే విషయంలో అందరిలోనూ డౌట్స్ మొదలయ్యాయి.
సినిమా బాగుందా బాలేదా, జనాలకి నచ్చిందా లేదా అన్నది పక్కన పెడుదాం. హీనపక్షం అర మిలియన్ డాలర్ల ఓపెనింగ్ రాకపోతే ఎలా? ఈ విషయంలో నితిన్ ప్లానింగ్ ఏ మాత్రం బాలేదు.
"బాహుబలి 2" తర్వాత తనకు ఇండివిడ్యువల్‌గా ఎంత మార్కెట్ ఉందో తెలుసుకోవాలని అందరూ చూస్తారని రానాకి తెలుసు. అందుకే "నేనే రాజు నేనే మంత్రి"కి మంచి ఓపెనింగ్స్ రాబట్టాలని ఎన్ని ట్రిక్కులు వేయాలో అన్ని వేశాడు. ఎంత పబ్లిసిటీ చేయాలో అంత చేశాడు. టూర్లు వేశాడు, సోషల్ మీడియాని వాడుకున్నాడు. అమెరికాలో అరమిలియన్‌కి పైగా వసూళ్లు సాధించాడు. సో అతను తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు.
కానీ ఇదే ట్రిక్క్, ఇదే ప్లానింగ్ నితిన్‌లో లోపించింది. నితిన్ ఇప్పటికైనా బద్దకం వదులుకోవాలి మరి. నితిన్ ఇప్పటికైనా మార్కెట్ పెంచుకునే విధానం తెలుసుకోవాలి. లేదంటే వైకుంఠపాళి ఆటలోలా ఎన్ని మెట్లు ఎక్కినా మళ్లీ జారున పడాల్సి వస్తుంది. మళ్లీ మొదటి నుంచి పాచిక వేయాల్సి వస్తూనే ఉంటుంది. మళ్లీ మొదటి నుంచి ఆట మొదలు పెడుతూనే ఉండాలి. ప్రతి హీరోకి మార్కెట్ స్థిరీకరణ ముఖ్యం.
- Log in to post comments