ఆత్మహత్య క్యాసెట్ అవసరమా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్... ఇంటర్లో ఫెయిల్ అయ్యాడనే విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే ఆయన అనేకసార్లు ఈ విషయాన్ని బయటపెట్టాడు. దాంతో పాటు తాను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అన్న మేటర్‌ని కూడా చెప్పాడు. ఒకసారి చెపితే బానే ఉంటుంది. పదే పదే అదే విషయాన్ని చెప్పడం అవసరమా అన్నదే ప్రశ్న.
తాజాగా చిరంజీవి బర్త్‌డే వేడుకల్లోనూ అదే మాట. ఇంటర్‌లో ఫెయిల్ అయినపుడు గన్ పెట్టి కాల్చుకోవాలని ప్రయత్నిస్తే తన అన్న చిరంజీవి ఆపి తనకి జీవితం గురించి తెలిపాడనీ, తన అంత గొప్ప వ్యక్తి అని చెప్పాడు. చిరంజీవి గొప్పతనం చెప్పడం వరకు ఓకే. కానీ ఆత్మహత్యప్రయత్నం గురించి పదే పదే మాట్లాడడం వల్ల తన అభిమానులకి తప్పుడు సందేశాన్ని ఇస్తున్నట్లు జనసేనాని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.
ఆత్మహత్యయత్నం గురించి గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆత్మహత్య టెండన్సీ ఉన్న టీనేజర్లు ఎక్కువున్న సమాజం మనది. ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. ఆయన ఉద్దేశం మంచిదే కావొచ్చు..కానీ పదే పదే చెప్పడం వేరే విధంగా మెసేజ్ పాస్ అవుతోంది.
- Log in to post comments