ప్రదీప్ ఎందుకు జంకుతున్నాడు?

Why Pradeep Machiraju is hesitating?
Saturday, July 11, 2020 - 10:15

ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. తెరిచిన తర్వాత కూడా చిన్నాచితకా సినిమాలకు సందు దొరకదు. దీంతో చిన్న సినిమాలన్నీ ఓటీటీకి క్యూ కడుతున్నాయి. అయితే ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు ప్రదీప్ నటించిన సినిమాను మాత్రం ఓటీటీకి ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది ఆశ్చర్యపోయారు.

ప్రదీప్ నటించిన "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" సినిమాను ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేయడం లేదనే అనుమానం అందరికీ కలుగుతోంది.

అయితే ఇక్కడ ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి ప్రదీప్ మాచిరాజు. ఓటీటీలో హీరోగా తన మొదటి సినిమాను రిలీజ్ చేస్తే, మాస్ జనాలకు దూరమైపోతాననే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఈ హీరో. అదే థియేటర్లలో సినిమా రిలీజైతే సి-సెంటర్ ఆడియన్స్ కు రీచ్ అవ్వొచ్చనేది ఇతడి ఆలోచన.

అయితే ఇక్కడ ప్రదీప్ తో సంబంధం లేకుండా నిర్మాతలు సినిమాను ఓటీటీకి ఇచ్చేయొచ్చు. కానీ సమస్య ఏంటంటే..  అలా చేస్తే పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తుందా అనేది ఒక డౌట్. ప్లస్, ప్రదీప్ మాస్ కి రీచ్ కాలేడు.