ఆ హీరోయిన్ కు ఆటిట్యూడా?

Why Raashi Khanna is not getting new offers?
Friday, July 17, 2020 - 14:30

అందంగా ఉంటుంది. నటన కూడా బాగుంటుంది. కానీ ఆటిట్యూడ్ వల్ల దూసుకెళ్లలేకపోతోంది అని అంటున్నారు. అవును.. హీరోయిన్ రాశిఖన్నా ఆటిట్యూడ్ సమస్య వల్లే కెరీర్ లో వెనకబడింది అనేది టాక్. . లేదంటే ఈ పాటికి పిల్ల కెరీర్ పీక్స్ లో ఉండేది.

కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్ తో బోణీ కొట్టింది రాశిఖన్నా. మినిమం గ్యాప్స్ లో హిట్స్ ఇస్తూనే ఉంది. కానీ ఎన్టీఆర్ సరసన మినహా పెద్ద హీరోల సినిమాల్లో చెయ్యలేకపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లయినా, ఇన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోల సినిమాలు పడకపోవడానికి ఇదే కారణం అంటున్నారు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఫ్యాన్స్ తో ఛాట్ చేసిన రాశిఖన్నా.. త్వరలోనే కొత్త సినిమాలు ఎనౌన్స్ చేస్తానని ప్రకటించింది. కొన్ని సినిమాలకు ఆల్రెడీ సైన్ చేశానని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ప్రకటనలు రాలేదు. దీంతో రాశి కెరీర్ పై మరిన్ని అనుమానాలు ఎక్కువయ్యాయి.

అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న "మహాసముద్రం" సినిమాలో రాశిఖన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇది బిగ్ హీరోలు నటించే మూవీ కాదు. కనీసం ఆ ప్రాజెక్టైనా ఈ హీరోయిన్ చేతిలో పడుతుందేమో చూడాలి.