ర‌కుల్ అలా ఎందుకు చేసింది

Why Rakul turned a journalist in real life?
Monday, May 22, 2017 - 16:30

ర‌కుల్ ప్రీతి సింగ్ జ‌ర్న‌లిస్ట్ అవ‌తార‌మెత్త‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక‌వైపు ఆమె 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ప్ర‌మోష‌న్‌ల‌తో బిజీ్ర‌గా ఉంది. మ‌రోవైపు, మ‌హేష్‌బాబుతో రెండు డ్యూయెట్‌లు పాడాలి ' స్పైడ‌ర్' కోసం. అలాగే బోయ‌పాటి సినిమా పూర్తి చెయ్యాలి. ఇన్ని క‌మిట్‌మెట్స్ మ‌ధ్య ఆమె తీరిక చేసుకొని ఒక సెల‌బ్రిటీని ఇంట‌ర్వ్యూ చేసింది. 

గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరొందిన స‌చిన్ టెండూల్క‌ర్‌ని ఆమె ఒక జ‌ర్న‌లిస్ట్‌గా ఇంట‌ర్వ్యూ చేసింది. స‌చిన్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న 'స‌చిన్ ఏ బిలియ‌న్ డ్రీమ్స్' అనే డాక్యుడ్రామా విడుద‌ల‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం స‌చిన్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. దాంతో ర‌కుల్ స‌చిన్ కోసం ఆ ప‌ని చేసింది. స‌చిన్‌ని ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకొని కాసేపు మాట్లాడే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రు వ‌ద‌లుకుంటారు చెప్పండి. 

అందుకే ఆమె అర‌గంట సేపు వీడియో ఇంట‌ర్వ్యూ చేసింది. స‌చిన్‌తో మాట‌లాడే అవ‌కాశం సెలబ్రిటీల‌కైనా అంత‌ ఈజీగా రాదు క‌దా. సో ర‌కుల్ ఒక ఫ్యాన్‌గా మారి అలా చేసింద‌న్న‌మాట‌.