సమంత సినిమాలు తగ్గించిందా?

Why Samantha has reduced number of movies?
Friday, February 28, 2020 - 11:15

క్రేజ్ ఉంది. స్టార్ హీరోలంతా ఛాన్సులిస్తారు. నిర్మాతలు అడిగినంత ఇస్తారు. కానీ సమంత మాత్రం తనకుతానుగా సినిమాలు తగ్గించేసింది. రీసెంట్ గా జాను మినహా ఆమె మరో సినిమా చేయలేదు. ఈ సంగతి పక్కనపెడితే ఆమె కొత్తగా మరో సినిమాకు సంతకం కూడా చేయలేదు. తమిళ, కన్నడ సినిమాలకు ఇస్తున్న ప్రయారిటీ తెలుగుకు మాత్రం ఇవ్వడం లేదు. సమంత ఎందుకిలా చేస్తోంది.

ఆమె సంతానం కోసం ఎదురుచూస్తోందని, అందుకే సినిమాలు తగ్గించేసిందంటూ ఆమధ్య గాసిప్స్ వచ్చాయి. కానీ సమంత సినిమాలు తగ్గించడానికి అసలు కారణం అది కాదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. భర్త నాగచైతన్యతో కలిసి ఓ బ్యానర్ స్థాపించబోతోంది.

తను కచ్చితంగా ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవుతానని సమంత ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. చెప్పినట్టుగానే ఆ దిశగా పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ కొత్త కుర్రాడు చెప్పిన స్టోరీలైన్ కు సమంత-నాగచైతన్య ఓకే చేసినట్టు టాక్. బ్యానర్ ను స్థాపించిన తర్వాత సినిమాను ప్రకటించాలనుకుంటున్నారు. అయితే తమ సొంత బ్యానర్ సినిమాలో మాత్రం వీళ్లిద్దరూ నటించరు. మంచి కంటెంట్ తో చిన్న సినిమాలు చేయాలనేది ఈ జంట ప్లాన్.

ఇప్పటికే అక్కినేని కాంపౌండ్ లో అన్నపూర్ణ స్టుడియోస్ తో పాటు మనం ఎంటర్ టైన్ మెంట్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి అనుబంధంగా మరో కొత్త బ్యానర్ రాబోతోందన్నమాట.