నార్త్ లో ఎందుకు తేడా కొట్టింది?

Why Sye Raa flopped in North India?
Saturday, October 5, 2019 - 18:30

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అంచనాలకి తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కుమ్మేసింది. మొదటి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సైరా 55 కోట్ల రూపాయలని కొల్లగొట్టింది. ఇది చాలా పెద్ద అమౌంట్. మెగాస్టార్ సత్తా ఏంటో చూపించింది. శని, ఆదివారాల్లోనూ ఇదే ఊపు ఉండడం ఖాయం. అయితే, ఎన్నో ఆశలు పెట్టుకున్న నార్త్ ఇండియా మార్కెట్ మాత్రం చాలా నిరాశపరిచింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్'... చిరంజీవి సినిమాకి బ్యాండ్ పడేలా చేసింది. 'వార్' 100 కోట్ల మార్క్ దాటింది. సైరా... హిందీ వెర్షన్ మొదటి మూడు రోజుల్లో కేవలం నాలుగు కోట్ల రూపాయలని సంపాదించింది. 

తెలుగులో ప్లాప్ అయిన 'సాహో' ...బాలీవుడ్ మార్కెట్ లో 150 కోట్ల రూపాయలని కొల్లగొట్టింది. కానీ 'సైరా' మాత్రం... టోటల్ గా ... 10 కోట్ల రూపాయల లోపే కథ ముగించేలా ఉంది. నార్త్ వారికి ఎందుకో ఈ మూవీ అంతగా నచ్చలేదు. 

తెలుగు సినిమాల ఆధిపత్యం పెరుగుతోంది అని అక్కడి మీడియా మన తెలుగు సినిమాలని తొక్కొస్తోందనేది ఒక మాట. అది ఎంత నిజమో కానీ 'సైరా' .... హిందీలో నిరాశపరిచింది అనేది నిజం.