త్రివిక్రమ్ వదులుకుంది ఎందుకంటే!

Why Trivikram didn't take up Vakeel Saab?
Sunday, June 7, 2020 - 13:00

పవన్ కు అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తే అది మళ్లీ త్రివిక్రమ్ సినిమాతోనే. కానీ "వకీల్ సాబ్" లో త్రివిక్రమ్ ప్రమేయం లేదు. దీంతో "అజ్ఞాతవాసి" తర్వాత పవన్ కు, త్రివిక్రమ్ కు చెడిందంటూ స్టోరీలు రాసేవాళ్లు కూడా ఎక్కువయ్యాయి. ఎట్టకేలకు "వకీల్ సాబ్"తో త్రివిక్రమ్ కనెక్షన్ ఏంటనేది బయటపడింది.

పవన్ రీఎంట్రీకి "పింక్" రీమేక్ ను సెలక్ట్ చేసిందే త్రివిక్రమ్. దిల్ రాజు, త్రివిక్రమ్ చర్చలతోనే "పింక్" రీమేక్ స్టార్ట్ అయిందనే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు వేణుశ్రీరామ్. అంతేకాదు.. వాస్తవంగా చూసుకుంటే ఈ సినిమాను రీ-రైట్ చేయాలని త్రివిక్రమ్ భావించాడని, లెక్కప్రకారం స్క్రిప్ట్ వర్క్ చేయాల్సింది త్రివిక్రమే అంటున్నాడు అతడు.

"పింక్ రీమేక్ గురించి ఫస్ట్ చర్చించుకున్నది దిల్ రాజు, త్రివిక్రమే. 'వకీల్ సాబ్' సినిమాకు రాస్తానని త్రివిక్రమ్ చెప్పారు. కానీ ఆ టైమ్ లో 'అల వైకుంఠపురములో' సినిమా హడావుడిలో ఉన్నారాయన. అందుకే ఆయనకు పవన్ సినిమాకు రాసే టైమ్ దొరకలేదు. బన్నీ సినిమా విడుదలైన 4-5 రోజులకే 'వకీల్ సాబ్' మొదలుపెట్టాం."

ఇలా అసలు విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు వేణుశ్రీరామ్. ఫ్రీ టైమ్ దొరికి ఉంటే కచ్చితంగా ఈ సినిమాను త్రివిక్రమే చేసి ఉండేవారని అంటున్నాడు.