త్రివిక్రమ్ మౌనం వెనుక రీజన్ అదే

Why Trivikram has remained silent?
Wednesday, May 20, 2020 - 16:30

ఎన్టీఆర్ సినిమాని పక్కన పెట్టి త్రివిక్రమ్ మరో సినిమా చేసుకుంటాడు అనే మాట వినిపించింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు త్రివిక్రమ్ క్లారిటీ ఇస్తాడన్నారు. మరికొందరు ... బర్త్ డే నాడు ఎన్టీఆర్ సినిమా టైటిల్ ప్రకటిస్తాడని డ్రీం సాంగ్స్ వేసుకున్నారు. కానీ అవేవి జరగలేదు. ఎందుకంటే... ప్రస్తుతం ... త్రివిక్రమ్ కే కాదు హోల్ ఇండస్ట్రీకి ఏమి అర్థం కావడం లేదు.

షూటింగులు ఎలా మొదలు పెట్టాలి? ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు ఇక్కడ. వాటికి ఆన్సర్స్ రానప్పుడు ... ఏ కాకపోతే బి, బి కాకపోతే సి అనే ఈక్వేషన్లు, కాంబినేషన్లు మాత్రం మాట్లాడుకోవడానికి ఉంటాయి.

త్రివిక్రమ్ కి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ తోనే తన నెక్స్ట్ సినిమా అని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు కానీ "ఆర్.ఆర్.ఆర్" షూటింగ్ డేట్స్, రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యేంతవరకు ... ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ కి గ్యారెంటీగా ఏమి చెప్పలేడు. అందుకే... ఎన్టీఆర్ బర్త్ డే నుంచి అటు రాజమౌళి క్యాంప్ నుంచి ఇటు తివిక్రమ్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ లు రాలేదు.

కాలమే సమాధానం చెప్తుంది... ఈ కొరోనా వల్ల ఏర్పడ్డ కన్ఫ్యూజన్ కి.