సెక్స్ లో పాల్గొనలేదు: హీరోయిన్

Wife, I fame Gunjan's bold talk
Friday, January 3, 2020 - 22:30

"వైఫ్ ఐ" అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది గుంజన్. ఈ సినిమాలో ఆమె ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. తెరపై బోల్డ్ గా నటించడమే కాదు, తెరవెనక కూడా అంతే బోల్డ్ గా మాట్లాడుతోంది ఈ బ్యూటీ. తనకు అందమైన ఫిగర్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను, అందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది.

ఎక్స్ పోజింగ్ చేసినంత మాత్రాన పోర్న్ స్టార్స్ అయిపోరని చెబుతోంది. "వైఫ్ ఐ" సినిమాలో 3-4 బోల్డ్ సీన్స్ లో మొహమాటపడకుండా నటించిన ఈ హీరోయిన్.. కవ్వించేలా కనిపించడానికి, పోర్న్ కు  చాలా తేడా ఉందంటోంది. తాము సినిమాలో సెక్స్ యాంగిల్స్ కు పోజులు మాత్రమే ఇస్తామని, సెక్స్ చేయమని చెబుతోంది. ఈ సినిమాలో సెక్స్ చేసినట్లు  కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఆ బెడ్ రూమ్ సీన్స్ అంతా కెమెరా ట్రిక్కులే అంటోంది. 

సెక్సీగా కనిపించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్న గుంజన్, అలా కనిపించడం కూడా ఓ ఆర్ట్ అంటోంది. అయినా ప్రైవేట్ పార్ట్స్ చూపించకుండా ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా ఫర్వాలేదని చెపుతోంది. చూస్తుంటే.. ఇలాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలకు ఈమె కేరాఫ్ అడ్రస్ లా మారేలా ఉంది.