అమల గురించి ధనుష్ నోరు విప్పుతాడా?

Will Dhanush respond about Amala Paul's issue
Monday, February 3, 2020 - 11:15

అమల పాల్ కాపురంలో ధనుష్ నిప్పులు పోశాడని అమల మాజీ మామయ్య ఆరోపణలు చెయ్యడం తమిళ ఫిలిం ఇండస్ట్రీ లో కలకలం  రేపింది. ధనుష్ వల్లే మా వాడు (దర్శకుడు ఏ ఎల్ విజయ్) అమలకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అని అళగప్పన్ ఆరోపించారు. అళగప్పన్ .. అమల మాజీ భర్త విజయ్ తండ్రి. 

ధనుష్ ఇంతవరకు స్పందించలేదు. అమల కూడా మౌనమే వహిస్తోంది. అయితే, ధనుష్ ఇంట్లో ఈ మేటర్ కొంత ఇబ్బంది రేపే అవకాశం ఉంది. 

పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో నటించొద్దు అనేది అమల పాల్ అత్తమామలు పెట్టిన కండీషన్. ఐతే, ఆమెని బలవంతంగా తన సినిమాలో ధనుష్  నటింపచేశాడు అన్నట్లు అళగప్పన్ మాట్లాడారు. అమలకి నటించాలి అనేది లేకుంటే.... ధనుష్ ఎలా ఆఫర్ ఇస్తాడు? ఈ గోల అంతా ... అమలతో మళ్లీ యాక్టింగ్ చేయించడమేనా? ఇంకా ఏదైనా మేటర్ ఉందా అనేదే ఇప్పుడు అందరిలో రేగుతున్న డౌట్. మరి అదేంటో?

|

Error

The website encountered an unexpected error. Please try again later.