క‌ల్యాణం మీద అంచ‌నాలున్నాయా?

Will Dil Raju's formula work this time?
Wednesday, August 8, 2018 - 15:15

దిల్‌రాజు నిర్మించిన "శ్రీనివాస క‌ల్యాణం" రేపే థియేట‌ర్ల‌లోకి రానుంది. కానీ ఈ సినిమా గురించి పెద్ద‌గా జ‌నంలో క్రేజ్ ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ప‌ట్టుకో ప‌ట్టుచీర టైప్‌లో ఏవేవో  ప్ర‌మోష‌న్లు ఏదో దిల్ రాజు త‌న పంథాలో చేస్తున్నారు కానీ సోషల్ మీడియాలోనూ, ట్రెండింగ్ టాఫిక్స్‌లోనూ ఈ సినిమా గురించి బ‌జ్ అయితే క‌నిపించ‌డం లేదు.

ఐతే త‌న మార్క్ ఫ్యామిలీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద గురి త‌ప్ప‌వ‌ని దిల్‌రాజు గ‌ట్టి న‌మ్మ‌కం. మీడియాలో, సోష‌ల్ మీడియాలో టాక్ ఎలా ఉన్నా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆద‌రిస్తార‌నేది ఆయ‌న విశ్వాసం. గ‌తేడాది శ‌త‌మానం భ‌వ‌తి సినిమాకి ప్ర‌ధాన క్రిటిక్స్ 2.75కి మించి రేటింగ్స్ ఇవ్వ‌లేదు, ఐనా ఆడింది క‌దా అనేది ఆయ‌న ఆర్గ్యుమెంట్‌. ఆ విధంగా ఈ సినిమా కూడా టార్గెట్‌ని రీచ్ అవుతుంద‌ని ఆయ‌న త‌నదైన శైలిలో పట్టుచీర‌లు, పెళ్లిసారెల‌ ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.

మ‌రి ఇది కూడా మ‌రో "శ‌త‌మానం భ‌వ‌తి" అవుతుందా? హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్‌కి భారీ విజ‌యాన్నిస్తుందా?  పెళ్లి అనేది ఎవ‌ర్‌గ్రీన్ హిట్ ఫార్మూలా. మ‌రి దిల్‌రాజు న‌మ్మ‌కం, ఆయ‌న న‌మ్ముకున్న ఫార్మూలా వ‌ర్క‌వువ‌ట్ కావాల‌ని ఆశిద్దాం.