12 ఏళ్ల తర్వాత కలుస్తారా?

Will Gopichand and Anushka team up again?
Tuesday, June 2, 2020 - 10:00

గోపీచంద్-అనుష్క.... 
ఈ కాంబినేషన్ లో గతంలో "లక్ష్యం", "శౌర్యం" లాంటి సినిమాలొచ్చాయి. అయితే ఆ తర్వాత మళ్లీ వీళ్లు కలుసుకోలేదు. అలా దూరమైన అనుష్క, గోపీచంద్.. ఇన్నాళ్లకు కలుస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

అవును.. తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రాబోతున్న "అలివేలు వెంకటరమణ "సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టులో ముందుగా కాజల్ ను అనుకున్నారు. కానీ లాక్ డౌన్ తర్వాత ఆమె పూర్తిగా ఆచార్య సినిమాకు ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. ఆ తర్వాత తమిళ సినిమాతో బిజీ అవ్వబోతోంది. ఓ దశలో కీర్తిసురేష్ పేరు పరిశీలించినప్పటికీ అది కూడా వర్కవుట్ కాలేదు.

చివరికి అలివేలు పాత్ర పోషించే అవకాశం అనుష్కను వరించింది. ప్రస్తుతం ఈ దిశగా చర్చలు నడుస్తున్నాయి. అనుష్క ఓకే అంటే వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. లేదంటే మరో హీరోయిన్ కోసం వెదుకులాట మొదలవుతుంది. మరి 12 ఏళ్ల తర్వాత గోపీచంద్ తో కలిసి అనుష్క స్క్రీన్ షేర్ చేసుకుంటుందా అనేది చూడాలి.