ఈసారైనా వస్తుందా రాదా?

Will Kajal Aggarwal do promotions this time?
Monday, June 19, 2017 - 17:45

ప్రచారానికి, కాజల్ కు ఆమడ దూరం. షూటింగ్ కంప్లీట్ చేయడంతోనే తన పని అయిపోతుంది. మూవీ ప్రమోషన్ కు వెళ్లాలని ఎప్పుడూ అనుకోదు. ఇదే కండిషన్ పై సినిమాకు సంతకం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కెరీర్ లో ఇప్పటివరకు కాజల్ ప్రచారానికొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే కాజల్ తన 50వ సినిమా చేసింది. 

రానాతో చేసిన "నేనే రాజు నేనే మంత్రి" సినిమా కాజల్ కు 50వ సినిమా. మరి తన కెరీర్ లో ఇంత స్పెషల్ మూవీకి కాజల్ ప్రచారం కల్పిస్తుందా, కల్పించదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది. 

ఖైదీ నంబర్ 150 సినిమాకు ప్రచారం చేసింది కాజల్. కాకపోతే అది పాక్షికంగానే. విడుదల తర్వాత మీడియాకు ఓ చిన్న ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడిది తన 50వ సినిమా. తన కెరీర్ లో ఇది సంథింగ్ స్పెషల్ మూవీ అని కాజల్ భావిస్తే తప్పకుండా ప్రచారానికి వస్తుంది. లేదంటే మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కు కూడా ఆమె దూరంగానే ఉంటుంది. కచ్చితంగా ప్రమోషన్ కు రావాల్సిందేనంటూ ఆమెను ఎవరూ గట్టిగా అడగలేరు. 

నాగచైతన్యతో చేసిన దడ సినిమా నుంచి సినిమాలకు ప్రచారం కల్పించే విషయాన్ని గాలికొదిలేసింది కాజల్. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంబంధించి మీడియా ముందుకొచ్చినప్పటికీ.. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో పూర్తిగా మీడియా ముందుకు రావడం తగ్గించేసింది. మరి ఆమె తన 50వ సినిమా ప్రమోషన్ కు మీడియా ముందుకు వస్తుందా రాదా అనేది చూడాలి.