కీర్తి అనుష్కలా మారదు కదా!

Will Keerthy Suresh gain weight for Mahanati?
Tuesday, June 6, 2017 - 16:15

ఇప్పటికే కాస్త బొద్దుగా ఉంటుంది. ఆ విషయం సౌత్ లో అందరికీ తెలుసు. అలాంటి బొద్దుగుమ్మ ఇంకాస్త ఒళ్లు చేస్తే కష్టమే మరి. కానీ తప్పదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తోందక్కడ. కాస్త లావెక్కక తప్పదిక్కడ. ప్రస్తుతం కీర్తి సురేష్ అదే పనిలో ఉందట.

సావిత్రి పాత్ర కోసం మరింత బొద్దుగా తయారయ్యేందుకు రెడీ అవుతోంది. ఇలా లావెక్కిన ప్రతిసారి నటీనటులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. బాహుబలి సినిమా కోసం బరువెక్కిన ప్రభాస్ తగ్గడానికి చాలా కష్టపడ్డాడు. ఇక అనుష్క అయితే సైజ్ తగ్గించుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ఇలాంటి అనుభవాలు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. కీర్తిసురేష్ కు కూడా ఇప్పుడు అదే టెన్షన్ పట్టుకుందట.

మహానటి సావిత్రి కాస్త బొద్దుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ క్యారెక్టర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ విషయం ఆలోచించలేదు కీర్తిసురేష్. కానీ లావెక్కిన తర్వాత తిరిగి తగ్గగలనా లేదా అనే అనుమానం మాత్రం కీర్తిసురేష్ కు ఉంది. ఒళ్లు పెంచే లేపు పవన కల్యాణ్ సినిమాను పూర్తిచేయాలనుకుంటోంది.