కియరా సై అంటుందా?

Will Kiara pair up with Tamil Superstar Vijay?
Thursday, August 8, 2019 - 08:00

కియరాకి క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. ఆమెని ఎలాగైనా ఒప్పించి తన సరసన నటింపచేయాలని ప్రయత్నిస్తున్నాడు కోలీవుడ్ అగ్ర హీరో విజయ్. కియరాతో ఇప్పటికే సంప్రతింపులు స్టార్ట్ చేశారట. విజయ్ ప్రస్తుతం "బిగిల్" (విజిల్) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ నాగరాజు అనే యువ దర్శకుడు తీసే సినిమాలో నటిస్తాడు. ఆ మూవీలో హీరోయిన్ గా కియరాని తీసుకుంటున్నారట. మరి కియరా ఒప్పుకుంటుందా?

ఆమెకి ఇపుడు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాలకే డేట్స్ ఇవ్వడం లేదు. మరి కోలీవుడ్ లో విజయ్ సరసన కాబట్టి ఒప్పుకుంటుందేమో. ఇంతవరకు ఆమె తమిళ సినిమాల్లో నటించలేదు.

కియరా అద్వానీకి తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకొంది. "భరత్ అనే నేను", "వినయ విధేయర రామ" చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ రామ్ చరణ్ తో మంచి దోస్తీ ఉంది. మొన్నే ఆమె బర్త్ డే సంబరాల్లో చరణ్ కూడా పాల్గొన్నాడు. కానీ ఆమె ఇపుడు టాలీవుడ్ సినిమాలపై అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. దానికి రీజనేంటంటే... ఆమె నటించిన బాలీవుడ్ మూవీ "కబీర్ సింగ్" సెన్సేషనల్ విజయం సాధించింది. ఓవర్ నైట్ ఆమె బిగ్ హీరోయిన్ గా మారిందక్కడ. దాంతో ఆమెకి అక్కడ వద్దంటే అవకాశాలు. అందుకే తెలుగు సినిమమాలకి డేట్స్ కేటాయించేంత ఖాళీ లేదు.