తిప్ప‌రా మీసం అంటాడా?

Will Mahesh Babu sport thick moustache for Sarileru Neekevvaru
Monday, June 17, 2019 - 15:30

మ‌హేష్‌బాబు వెకేష‌న్ నుంచి వ‌చ్చాడు. మ‌రో 15 రోజుల్లో కొత్త సినిమా షూటింగ్ మొద‌లుపెడుతాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రం కోసం రెడీ అవుతాడు. మ‌హేష్‌బాబు గురించి తెలిసిన వారు ఎవ‌రైనా... ఆయ‌న కంప్లీట్ మేకోవ‌ర్‌కి ఒప్పుకోరు అని చెపుతారు. లైట్‌గా గడ్డం పెంచాడు. కొంత కండ‌లు పెంచుకోవ‌డం మిన‌హా కంప్లీట్ డ్రాస్టిక్ ఛేంజ్‌కి అస్స‌లు ఒప్పుకోరు.

సిక్స్‌ప్యాక్‌బాడీ సాధించి...ష‌ర్ట్ విప్పేయ‌డాలు, అర్జున్‌రెడ్డిలా మొత్తం గ‌డ్డం, మీసాలు పుల్లుగా పెంచేయ‌డాలు, నా పేరు సూర్య‌లో బ‌న్నిలా మిల‌ట్రీ క‌టింగ్ చేసుకోవ‌డాలు వంటి వాటికి దూరంగా ఉంటాడు. ఐతే స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం కోసం మ‌హేష్‌బాబు ఫుల్లుగా మీసం పెంచుతున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే మిలట్రీ క‌టింగ్‌కి కూడా ఒప్పుకున్నాడ‌ని రాస్తున్నారు.

కానీ నిజం ఏమిటంటే... ఈ సినిమాలో మ‌హేష్‌బాబుది సైనికుడి పాత్రే కానీ ఆర్మీకి సంబంధించిన బ్యాక్‌డ్రాప్ కాదు. ఆర్మీ నుంచి సొంత ఊరికి వ‌చ్చిన సైనికుడి క‌థ‌. కాబ‌ట్టి ఆర్మీ సోల్జ‌ర్ గెట‌ప్ ఉండ‌దు. మ‌హేష్‌బాబు మేక‌ప్‌లో, గెట‌ప్‌లో చిన్న చిన్న ఛేంజెస్ మాత్రం ఉంటాయి. 

ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే నెల మొద‌టి వారంలో మొద‌లుకానుంది. ర‌ష్మిక మందానా హీరోయిన్‌. అనిల్ రావిపూడి డైర‌క్ష‌న్‌లో అనిల్ సుంకర బ్యాన‌ర్ నిర్మిస్తోంది.