మరి చైతూ, బుజ్జి ఒప్పుకుంటారా?

Will Naga Chaitanya and Bujji agree for Chichore remake?
Saturday, November 16, 2019 - 20:00

హిందీలో నితేష్ తివారి డైరక్షన్ లో రామాయణం అనౌన్స్ చేశారు అల్లు అరవింద్. అది ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఈ గ్యాప్ లో నితేష్ తీసిన హిందీ  సినిమాని ఇటు తీసుకొస్తున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా తెలుగు రీమేక్ ని చైతన్య తో ప్లాన్ చేస్తున్నారనేది టాక్. కానీ చైతూకి అంత టైముందా. 

నాగచైతన్యకు రీమేక్స్ కొత్త కాదు. ఇంతకుముందు ప్రేమమ్ సినిమాను అదే టైటిల్ తో రీమేక్ చేశాడు. కాకపోతే.. చిచ్చోరె కొంత డిఫరెంట్. చిచోరే సినిమాలో హీరోతో పాటు అతడి గ్యాంగ్ అంతా కీలక పాత్ర పోషిస్తుంది. ఎవ్వర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. తెలుగులో కూడా అలాంటి గ్యాంగ్ దొరకాలి. హిందీ వెర్షన్ లో నటించిన నవీన్ పొలిశెట్టి, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే కాబట్టి, అతడ్ని రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే... చైతన్యకి సోలో హీరోగా పేరు దక్కదు. గ్యాంగ్ మొత్తానికి క్రెడిట్ వెళుతుంది. పైగా.. ఆ హిందీ మూవీ  పూర్తిగా డైరెక్టర్ టాలెంట్ మీదే నడిచింది. 3 ఇడియట్స్ లాంటి కథని గ్రిప్పింగ్ గా నేరేట్ చేశాడు. అఫ్ కోర్స్, అతడి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. దంగల్ సినిమా ఒక్కటి చాలు ... అయన ప్రతిభ గురించి చెప్పడానికి.

మరి నితేష్ రేంజ్ లో ఈ సినిమాను తెలుగులో ఎవరు డైరక్ట్ చేస్తారో చూడాలి. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పేరు వినిపిస్తోంది. కానీ ఆ డైరెక్టర్ రీమేక్ కి ఒప్పుకుంటాడా అనేది కూడా డౌటే... ప్రస్తుతం నాగచైతన్య ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకీ మామను రిలీజ్ కు రెడీ చేసిన చైతూ, కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.