ఎన్టీఆర్ దానికి ఒప్పుకుంటాడా?

Will NTR agree to this Rajamouli's idea?
Wednesday, June 28, 2017 - 18:45

నెక్స్‌ట్ ఏంటి అంటే ఇంకా స‌మాధానం ఇవ్వ‌డం లేదు జ‌క్క‌న్న‌. మాస్కో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నుంచి తాజాగా హైద‌రాబాద్‌కి వ‌చ్చిన రాజ‌మౌళి ..త్వ‌ర‌లో మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ టూర్ వేస్తాడ‌ట‌. ఆ త‌ర్వాత చైనా కూడా వెళ్లాల‌నుకుంటున్నాడు. బాహుబ‌లి 2 సినిమా చైనాలో విడుద‌ల కానుంది. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే అక్క‌డ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల అవుతుంది. రిలీజ్ డేట్ విష‌యంలో మ‌రో 15 రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది. 

సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌కి ముందే నెల రోజుల పాటు చైనాలో ప‌ర్య‌టించి ప్ర‌మోష‌న్ నిర్వ‌హించాల‌ని రాజ‌మౌళి టీమ్ భావిస్తోంది. చైనాలో దాదాపు 1200 కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టి దంగ‌ల్ ఓవ‌రాల్‌గా 2000 కోట్ల మార్క్‌ని అందుకొంది. బాహుబ‌లి 2.. 2000 కోట్ల మార్క్‌ని చేరుకోవాలంటే మ‌రో 350 కోట్లు రావాలి. చైనాలో హిట్ట‌యితే అది సులువే. అందుకే చైనా రిలీజ్‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాడు రాజ‌మౌళి.

మ‌రోవైపు, రాజ‌మౌళి నెక్స్‌ట్ మూవీ ..ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంద‌ని ఇండ‌స్ట్రీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న త‌దుప‌రి చిత్రంలో గ్రాఫిక్స్‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌ద‌ని రాజ‌మౌళి ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశాడు. కానీ సినిమా మాత్రం భారీ స్థాయిలోనే ఉంటుంద‌న్నాడు. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్‌తోనే తీయాల‌నుకుంటున్నాడ‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌. అయితే, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి హీరోల‌కి బాహుబ‌లిలు, మ‌గ‌ధీర‌లు ఇచ్చి త‌న‌తో సాదాసీదా సినిమా తీస్తే ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా? అనేది పాయింట్‌.