అంచనాలు అందుకోగలరా?

Will Pawan Kalyan's directors reach expectations?
Monday, March 16, 2020 - 17:00

పవన్ కల్యాణ్ తో సినిమా అంటే నక్కతోక తొక్కినట్టే. మరీ ముఖ్యంగా అయన రెండో ఇన్నింగ్స్ లో సినిమా అంటే అది మరీ మరీ లక్ అనే చెప్పాలి.  ఆ అరుదైన అవకాశం వేణు శ్రీరామ్, క్రిష్ కి దక్కింది. అయితే ఈ అవకాశాన్ని వాళ్లు ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రస్తుతం పవన్ రీఎంట్రీ ఇవ్వడం గొప్ప విషయం అనుకుంటే.. వేణుశ్రీరామ్, క్రిష్ లాంటి దర్శకులకు వెంటనే అవకాశం ఇవ్వడం మరో గొప్ప విషయం. పవన్ అయితే అవకాశం ఇచ్చేశాడు.. కానీ ఈ దర్శకులకి అసలు సవాల్ ఇప్పుడే వుంది. 

పింక్ రీమేక్ తో "వకీల్ సాబ్" సినిమా తీస్తున్న వేణు శ్రీరామ్ కి బలమైన కథ దొరికింది. హిందీ సినిమా "పింక్" సూపర్ పాయింట్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా దీన్ని మలచడమే పెద్ద సవాల్. విమెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ సాంగ్ అనుకున్నంతగా వైరల్ కాలేదు. 8 మిలియన్ల వ్యూస్ దగ్గరే తచ్చాడుతోంది. 

సాంగ్ సూపర్ అందులో డౌట్ లేదు. కానీ అంచనాలు మరి ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సమస్య. ఈ సాంగ్ ... ముందు చేసిన హైప్ ని అందుకోలేక పోయింది. ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం ఒక ఎత్తు అయితే అంచనాలు చేరుకోవడం అన్నిటికన్నా పెద్ద టాస్క్.