మెగాస్టార్‌ని ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తాడా?
ప్రభాస్ ఇటీవలే పారిస్‌కి వెళ్లాడు. వెకేషన్ కోసమని ఆ ఫ్లయిట్ ఎక్కి అయిదు రోజులు అవుతోంది. మళ్లీ హైదరాబాద్ రాక వచ్చే నెలలోనే. ఐతే సైరా సినిమా రిలీజ్‌కి ముందు ప్రభాస్ వస్తాడనీ, ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటాడనే టాక్ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ ఏంటంటే... ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయనున్నాడనేది.
ప్రభాస్ ... వీడియో ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాడట. అన్ని భాషల్లో ప్రసారం చేసేందుకు ఈ వీడియోని ప్లాన్ చేశారట. అంటే ప్రభాస్ యాంకర్‌గా క్వశ్చన్స్ అడుగుతుంటే చిరంజీవి సమాధానం ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు చెపుతున్నారు. నిజంగా ఇది జరిగేనా లేక ఏదీ వైరల్ ఏదీ నిజం న్యూస్‌లో ఆరాతీయాల్సిన టాఫిక్‌గా మిగులుతుందా?
మెగాస్టార్ అంటే ప్రభాస్‌కి చాలా గౌరవం. ప్రభాస్ ఎదిగిన తీరుని చిరంజీవి కూడా గొప్పగా చెపుతున్నారు ఎప్పటికపుడు పబ్లిక్ ఫంక్షన్‌లో. ఇద్దరి మధ్య ఆ అనుబంధం ఉంది కాబట్టి ఈ ఇంటర్వ్యూ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ రిలీజ్‌లోపు ప్రభాస్ హైదారాబాద్‌కి వస్తాడా అన్నదే ప్రశ్న.
ప్రభాస్ త్వరలోనే జాను అనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి. ఈ సినిమా కథలో మార్పులు చేస్తున్నారిపుడు. రాధాకృష్ణకుమార్ తీయనున్న ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. మళ్లీ ఫుల్‌ఫ్లెడ్జెడ్ షూటింగ్‌ని నవంబర్ నుంచి మొదలుపెడుతారట.
- Log in to post comments