రాజమౌళి ఈసారి కథ చెబుతాడా?

Will Rajamouli reveal the story of RRR?
Wednesday, October 31, 2018 - 23:00

తను ఏ సినిమా స్టార్ట్ చేసినా కొబ్బరికాయ కొట్టిన రోజే కథను కాస్త రివీల్ చేయడం రాజమౌళి స్టయిల్. ఈగ సినిమా ఓపెనింగ్ రోజైతే టోటల్ కథ మొత్తం చెప్పేశాడు. మర్యాదరామన్న టైమ్ లో కూడా స్టోరీలైన్ బయటపెట్టాడు. బాహుబలికి కూడా ట్విస్టులు చెప్పకపోయినా స్టోరీలైన్ చెప్పేశాడు. సో.. తన నెక్ట్స్ సినిమా కథ ముందే చెబుతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు జక్కన్న. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై  భారీ బడ్జెట్ తో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా. నవంబర్ మొద‌టి వారంలోనే లాంచ్ చేసి, షూటింగ్ షురూ చేయ‌నున్నాడు జ‌క్క‌న్న‌. అయితే లాంఛింగ్ రోజున రాజమౌళి సినిమా స్టోరీ చెబుతాడా లేదా అనే బెట్టింగ్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. 

ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ బాక్సర్లుగా కనిపిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా సాగింది. ఆ త‌ర్వాత వీరిలో ఒక‌రు పోలీసాఫీసర్ గా కనిపిస్తారంటూ పుకార్లు వచ్చాయి. చెర్రీ, తారక్ ఇద్దరూ సినిమాలో అన్నదమ్ములుగా కనిపించబోతున్నారనే మ‌రో రూమర్ కూడా వినిపిస్తోంది. ఈ పుకార్ల‌కి చెక్ చెప్పాలంటే ఓపెనింగ్ రోజు రాజమౌళి స్టోరీ గురించి ఏదో హింట్ ఇవ్వాలి. మరి జక్కన్న ఈసారి ఆ పని చేస్తాడా.. లేక సినిమాపై మరింత సస్పెన్స్ పెంచుతూ సైలెంట్‌గా ఉంటాడా? వెయిట్ అండ్ సీ